వరుస సినిమాలతో జోరుమీదున్న నేచురల్ స్టార్ నాని త్వరలోనే మరో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యమున్న సినిమాలో నటించనున్నారని తెలిసింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'టక్ జగదీశ్', 'శ్యామ్ సింగరాయ్' తర్వాత 'అంటే సుందరానికీ' చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. అనంతరం మరో రెండు సినిమాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. అందులో ఒకటి క్రీడా నేపథ్యంతో రూపొందనుందని తెలిసింది.
మరో స్పోర్ట్స్ డ్రామాలో నేచురల్ స్టార్! - nani foot ball movie
హీరో నాని మరో స్పోర్ట్స్ డ్రామా కథాంశంతో తెరకెక్కబోయే సినిమాలో నటించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో నాని ఫుట్‌బాల్ ప్లేయర్‌గా కనిపించనున్నారని సమాచారం.
నాని
ఇందులో నాని ఫుట్‌బాలర్ ప్లేయర్‌గా కనిపించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఇప్పటికే ఆయన 'భీమిలి కబడ్డీ జట్టు'లో కబడ్డీ ఆటగాడిగా, 'జెర్సీ'లో క్రికెటర్‌గా కనిపించి ప్రేక్షకులను మెప్పించారు.
ఇదీ చూడండి: క్యాష్: సుమపై నాని పంచ్‌లు.. నవ్వులే నవ్వులు!
Last Updated : May 22, 2021, 2:41 PM IST