నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'శ్యామ్ సింగరాయ్'. 'ట్యాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృిత్యాన్ దర్శకత్వం వహించారు. కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియిన్ ఇతర హీరోయిన్లుగా చేశారు. సోమవారంతో ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు ప్రకటించారు. త్వరలో ట్రైలర్‌తో పాటు విడుదల తేదీపై స్పష్టతనిచ్చే అవకాశముంది.
సిద్ధార్థ్ మల్హోత్రా సైనికుడిగా నటిస్తున్న చిత్రం 'షేర్షా'. కార్గిల్ వార్‌లో వీరమరణం పొందిన విక్రమ్బత్రా జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఆగస్టు 12 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో 'షేర్షా' స్ట్రీమింగ్ కానుంది. కియారా అడ్వాణీ హీరోయిన్. విష్ణువర్ధన్ దర్శకుడు.
కొరియన్ చిత్రం 'మిడ్ నైట్ రన్నర్స్' తెలుగులో రీమేక్ చేస్తున్నారు. రెజీనా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్-క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ విషయాన్ని చెబుతూ ఓ ఫొటోను విడుదల చేశారు.