'నాంది' సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన అల్లరి నరేశ్.. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టారు! దీంతో నెటిజన్ల నుంచి సెలబ్రిటీల వరకు అతడి నటనను మెచ్చకున్నారు. ఈ క్రమంలోనే హీరో నాని.. నరేశ్‌ను ప్రశంసలతో ముంచెత్తుతూ ట్వీట్ చేశారు.
అల్లరి నరేశ్ పేరు మార్చుకో.. నాని సలహా - naandhi movie news
థియేటర్లలో 'నాంది' సినిమాకు విశేషాదరణ లభిస్తున్న దృష్ట్యా హీరో అల్లరి నరేశ్‌ను మెచ్చుకున్నారు నాని. పేరు మార్చుకోవాలని అతడికి సూచిస్తూ ట్వీట్ చేశారు.
అల్లరి నరేశ్ పేరు మార్చుకో.. నాని సలహా
'రేయ్ రేయ్ రేయ్.. 'అల్లరి నరేశ్' పేరు మార్చేయ్ ఇంక.. అల్లరి గతం.. భవిష్యత్తుకు ఇది నాంది. ఒక గొప్ప నటుడిని నీలో చూశాను. చాలా సంతోషంగా ఉంది. ఇకపై ఇలాంటివి నీ నుంచి మరిన్ని రావాలని కోరుకుంటున్నాను" అని నాని ట్వీట్ చేయగా, 'థ్యాంక్యూ బాబాయ్' అని నరేశ్ రీట్వీట్ చేశారు.
కోర్టు డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో న్యాయం కోసం పోరాడే వ్యక్తిగా అల్లరి నరేశ్ నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో మెప్పించారు. విజయ్ కుమార్ కనకమేడల దర్శకుడిగా పరిచయమయ్యారు.
Last Updated : Mar 1, 2021, 11:18 AM IST