తెలంగాణ

telangana

ETV Bharat / sitara

క్రేజీ వార్త: 'వి' సినిమా కోసం తమన్ - వి సినిమా టీజర్​

యాక్షన్ థ్రిల్లర్​గా రూపొందుతున్న 'వి' సినిమా కోసం తమన్ పనిచేయనున్నాడు. సన్నివేశాలకు మరింత బలం పెంచేందుకు, నేపథ్య సంగీతమందిస్తున్నాడు. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది.

Nani, Sudheer Babu's V gets a crazy new addition
'వి' సినిమా కోసం తమన్

By

Published : Feb 11, 2020, 12:55 PM IST

Updated : Feb 29, 2020, 11:29 PM IST

నేచురల్​ స్టార్​ నాని, సుధీర్​ బాబు నటిస్తున్న మల్టీస్టారర్ 'వి'. నివేదా థామస్​, అతిదీరావ్​ హైదరీ హీరోయిన్లు. ఈనెల 17న టీజర్​ను విడుదల చేయనున్నారు. ఇప్పుడీ చిత్రబృందంలోకి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ చేరాడు. నేపథ్య సంగీతాన్ని సమకూర్చనున్నాడు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

ఇటీవలే 'వెంకీమామ', 'ప్రతిరోజూ పండగే', 'డిస్కో రాజా', 'అల వైకుంఠపురములో' చిత్రాలతో మెప్పించాడు తమన్. ఇప్పుడు 'వి' సినిమాకు పనిచేయనున్నాడనే వార్త.. అభిమానుల్లో అంచనాల్ని పెంచుతోంది.

ఈ ప్రాజెక్టుకు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు. అమిత్ త్రివేది సంగీతమందిస్తున్నాడు. దిల్​రాజు​ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే నెల 25న ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ఇదీ చూడండి..సల్మాన్​ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన 'బుట్టబొమ్మ'

Last Updated : Feb 29, 2020, 11:29 PM IST

ABOUT THE AUTHOR

...view details