Shyam Singha Roy: కోలీవుడ్‌తో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని నటుడు నాని(Nani) అన్నారు. ప్రస్తుతం ఆయన తన తదుపరి చిత్రం 'శ్యామ్ సింగరాయ్' ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా పాల్గొంటున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నాని చెన్నైలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు.
"శ్యామ్ సింగరాయ్ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న సముద్రఖని అన్నయ్యకు థ్యాంక్స్. అన్నయ్యతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన నాకు తెలుసు. చెన్నైకి వచ్చిన ప్రతిసారీ ఆయన్ని కలవకుండా హైదరాబాద్‌కి తిరిగి వెళ్లను. ఇప్పుడు ఆయన తెలుగులోనూ బిజీ నటుడు అయ్యారు. నా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైకి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పటికీ ఎన్నో సార్లు చెప్పాను.. నేను నటుడ్ని అయ్యానంటే కారణం ఒకరకంగా తమిళ సినిమానే. కమల్‌హాసన్, మణిరత్నం చిత్రాలు చూస్తూ పెరిగిన నాపై కోలీవుడ్ చిత్రాలు ఎంతో ప్రభావాన్ని చూపాయి. నేను కీలక పాత్రలో నటించిన 'ఈగ' సినిమా కోలీవుడ్‌లోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఇక్కడ నాకూ అభిమానులు పెరిగారు. దాంతో ఆ తర్వాత వచ్చిన 'వెప్పం'(సెగ), 'ఆహాకళ్యాణం' చిత్రాలను కోలీవుడ్‌లోనూ విడుదలచేయగా అవి రెండు ఫ్లాప్ అయ్యాయి. దాంతో మరోసారి, ప్రేక్షకుల మనసులు హత్తుకునే కథతో రావాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఇన్ని రోజుల నుంచి నా సినిమాలను తమిళంలో రిలీజ్ చేయలేదు. 'జెర్సీ'ని తమిళంలో రిలీజ్ చేయాలని అనుకున్నాం. కానీ అది సాధ్యం కాలేదు. దీంతో ఎన్నో సంవత్సరాల విరామం తర్వాత ఈ సినిమా తప్పకుండా అందరి హృదయాలను హత్తుకుంటుందని నమ్మకంతో ఇక్కడ కూడా విడుదల చేస్తున్నాం. సినిమా ఎంతో బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా"
-నాని, నటుడు
ఈ సినిమాలో మీరు రెండు రకాల పాత్రలు పోషించారు కదా ఈ సినిమా కోసం మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి?
నాని: బరువు పరంగా చూసుకుంటే ఈ సినిమాలోని రెండు పాత్రలు అటూ ఇటూగా ఒకేలా ఉంటాయి. కాకపోతే నటనలో ఇద్దరూ వేర్వేరు కాలాలకు చెందిన వారు. అందులోనూ శ్యామ్ 1950, 60 సంవత్సరాలకు చెందిన వారు కాగా.. వాసు 2020. రెండు పాత్రల్ని నేను ఎంజాయ్ చేస్తూ చేశాను.
సినిమాలో ఎక్కువశాతం బంగాల్‌ను చూపించినట్టు ఉన్నారు. ఇక్కడి వారికి కనెక్ట్ అవుతుందా?
నాని: సినిమా చూసేవరకూ ఇది మన ప్రాంతం సినిమా కాదనే భావన మనలో ఉంటుంది. కానీ సినిమా చూశాక.. అన్ని ప్రాంతాల ప్రజలు దీనికి కనెక్ట్ అయిపోతారు.
ఇప్పుడు తెలుగు చిత్రాలు తమిళంలో.. అలాగే ఇక్కడ సినిమాలు అక్కడ విడుదలవుతున్నాయి మీ కామెంట్?