తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వారి కోసం నాని 'సమ్​థింగ్ స్పెషల్'! - నేచురల్ స్టార్ నాని

కరోనా సమయంలో తమ ప్రాణాలకు తెగించి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఫ్రంట్​లైన్ వర్కర్స్. వారిపై ఓ షార్ట్ ఫిల్మ్​ తెరకెక్కిస్తున్నారట. ఇందులో నేచురల్ నాని కీలకపాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. నెట్టింట ఆయన షేర్ చేసిన ఓ ఫొటో ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.

nani
నాని

By

Published : Jun 8, 2021, 9:39 PM IST

కరోనా ఆపత్కాల పరిస్థితుల్లో బాధితుల్ని ఆదుకునేందుకు ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎంతో సేవ చేస్తున్నారు. వారి జీవితాల్ని పణంగా పెట్టి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారి రుణం తీర్చుకోలేది అనడంలో సందేహం లేదు. తాజాగా ఇదే ఇతివృత్తంపై నేచురల్ స్టార్ నాని ఓ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కిస్తున్నారట. తాజాగా ఆయన నెట్టింట పెట్టిన ఓ పోస్టు ఇందుకు బలం చేకూరుస్తోంది.

తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టిన నాని 'ఫర్ ఎవర్ ఫ్రంట్ లైన్ వర్కర్స్, సమ్​థింగ్ స్పెషల్ కమింగ్ సూన్' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కెమెరాలో సన్నివేశాన్ని చూస్తోన్న ఓ ఫొటోను షేర్ చేశారు. దీనిని చూస్తుంటే ఇదొక షార్ట్ ఫిల్మ్ అని తెలుస్తోంది. దీంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తూ ఎప్పుడూ రిలీజ్ చేయబోతున్నారంటూ వాకబు చేస్తున్నారు.

ఇవీ చూడండి: Chellam Sir: 'కరోనా సీక్రెట్ తెలిసిన ఏకైక వ్యక్తి'

ABOUT THE AUTHOR

...view details