తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'శ్యామ్‌ సింగరాయ్‌' అందుకే మరింత స్పెషల్​: నాని - shyam singharoy movie release date

Singharoy Trailer Release: తాను నటించిన 'శ్యామ్​సింగరాయ్'​ సినిమా చూసిన ప్రతిఒక్కరూ సంతృప్తి చెందుతారని అన్నారు హీరో నాని. ఈ చిత్రం కోసం తమ చిత్రబృందం చాలా కష్టపడిందని చెప్పారు.

నాని శ్యామ్​సింగరాయ్​ ట్రైలర్​, nani shyam singharoy trailer
నాని శ్యామ్​సింగరాయ్​ ట్రైలర్​

By

Published : Dec 15, 2021, 6:33 AM IST

Singharoy Trailer Release:"తెలుగు సినిమా ఉన్నంత కాలం.. మ్యూజిక్‌ ఉన్నంత కాలం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు జీవించే ఉంటారు. ఆయన ఆఖరి పాట మా 'శ్యామ్‌ సింగరాయ్‌'లో ఉండటం వల్ల ఈ సినిమా మరింత స్పెషల్‌గా మారిపోయింద"న్నారు నాని. ఆయన కథానాయకుడిగా రాహుల్‌ సంకృత్యాన్‌ తెరకెక్కించిన చిత్రం 'శ్యామ్‌ సింగరాయ్‌'. వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు. సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. ఈ సినిమా ఈనెల 24న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం నిర్మాత దిల్‌రాజు చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. "ఒక మంచి సినిమా చేశాక.. మనసులో ఓ నిండు గర్వం కనిపిస్తుంది. 'శ్యామ్‌ సింగరాయ్‌' చేశాక నాకలాంటి అనుభూతే కలిగింది. కచ్చితంగా చెబుతున్నా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సంతృప్తిగా బయటకు వెళ్తారు. రాహుల్‌ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఈ సినిమాలో దేవీ మీద ఓ పాట రాశారు. దేవీ మీద రాసిన పుస్తకాలన్నీ 45రోజుల పాటు చదివి ఆ పాట రాశానని శాస్త్రి గారు చెప్పారు. దేవీ పాటలో సాయిపల్లవి డ్యాన్స్‌ మరింత ఆకట్టుకుంటుంది. తన పాత్ర చాలా బాగుంటుంది. కీర్తిగా కృతి అద్భుతంగా నటించింది. నిర్మాత వెంకట్‌తో నా ప్రయాణం ఇక్కడితో ఆగిపోదు.. ఇంకా సుదీర్ఘంగా సాగుతుంది. ఈ చిత్రంతో ఎడిటర్‌ నవీన్‌ నూలి మరో నేషనల్‌ అవార్డు అందుకుంటాడని ఆశిస్తున్నా. అద్భుతమైన సెట్స్‌ వేసిన అవినాష్‌కు థ్యాంక్స్‌. అందరి కష్టంతోనే ఇలాంటి చిత్రం మీ ముందుకు తీసుకొస్తున్నాం. గర్వంగా చెబుతున్నా.. ఈ క్రిస్మస్‌ మనదే" అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ.. "దర్శకుడు, నిర్మాత కొత్తవాళ్లైనా.. నాని తన అనుభవంతో భుజస్కందాలపై పెట్టుకుని పూర్తి చేశారు. కచ్చితంగా నాని నమ్మకం నిజమవుతుందని అనిపిస్తోంది" అన్నారు.

సాయిపల్లవి, మాట్లాడుతూ.. "మా చిత్రంతో పాటు రాబోయే అన్ని సినిమాల్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా" అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత నిర్మాత వెంకట్‌ బోయనపల్లి, కృతిశెట్టి తదితరులు పాల్గొని మాట్లాడారు.

ఇదీ చూడండి:భుజం ఎత్తడం వల్ల నాకు ఆ సమస్య వచ్చింది: అల్లు అర్జున్

ABOUT THE AUTHOR

...view details