తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'శ్యామ్​ సింగరాయ్​' సోషల్ మీడియా రివ్యూ.. నాని సక్సెస్ కొట్టాడా? - సాయి పల్లవి

Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని ద్విపాత్రాభినయం చేసిన 'శ్యామ్ సింగరాయ్​' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులు ఏమంటున్నారో తెలుసుకోండి.

Shyam Singha Roy Twitter Review
శ్యామ్ సింగరాయ్​

By

Published : Dec 24, 2021, 9:52 AM IST

Updated : Dec 24, 2021, 2:45 PM IST

Shyam Singha Roy Review: రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా 'శ్యామ్ సింగరాయ్'. శుక్రవారం థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ఇప్పటికే ప్రీమియర్​ షోలు చూసిన ప్రేక్షకులు ట్విట్టర్​లో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సినిమా తొలి భాగం అలరించేలా ఉందని, మలి భాగంలో ఎమోషనల్ సీన్స్​తో కట్టిపడేశారని పలువురు నెటిజన్లు అంటున్నారు.

నాని, సాయి పల్లవి జోడీ మరోసారి అదరగొట్టిందని హర్షం వ్యక్తంచేశారు అభిమానులు. ఇక సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ బ్యాక్​గ్రౌండ్​ స్కోర్​తో సినిమాకు ప్రాణం పోశారని కొనియాడారు.

ఈ సినిమాలో కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్​ కూడా కథానాయికలుగా నటించారు. బెంగాల్ నేపథ్యంలోని కథతో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటం వల్ల థియేటర్లలో హౌజ్​ఫుల్ కలెక్షన్లు కనిపిస్తున్నాయి.

ఇదీ చూడండి:83 Movie Review: '83'.. సినిమా కూడా గెలిచేసిందా?

Last Updated : Dec 24, 2021, 2:45 PM IST

ABOUT THE AUTHOR

...view details