నేచురల్ స్టార్ నాని 'శ్యామ్ సింగరాయ్'(shyam singha roy release date) రిలీజ్ డేట్ ఖరారైంది. క్రిస్మస్ కానుకగా ఈ డిసెంబరు 24 థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని సోమవారం(అక్టోబరు 18) అధికారికంగా ప్రకటించడం సహా పోస్టర్‌ను విడుదల చేశారు.
Nani new movie: నాని 'శ్యామ్‌సింగరాయ్' రిలీజ్ డేట్ ఫిక్స్ - నాని శ్యామ్‌సింగరాయ్ రిలీజ్ డేట్
నాని-సాయిపల్లవి జంటగా నటిస్తున్న 'శ్యామ్‌సింగరాయ్'(shyam singha roy release date) థియేటర్లలోకి రావడానికి డేట్ ఫిక్సయింది. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
పీరియాడికల్, మోడ్రన్.. రెండు కలిసేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు పోస్టర్లు చూస్తుంటే తెలుస్తోంది. కోల్‌కతా నేపథ్యంగా ఎక్కువభాగం ఉండనుంది. ఇందులో నాని(nani new movie) సరసన సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'ట్యాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.
అయితే నాని గత రెండు సినిమాలు 'వి', 'టక్ జగదీష్'(tuck jagadish review) సినిమాలు ఓటీటీలోనే(ott movies this week) విడుదలయ్యాయి. ఎట్టకేలకు ఈ చిత్రం థియేటర్లలో వస్తుండటం వల్ల ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారు. ఆ రెండు చిత్రాలు ఓటీటీలో మోస్తరుగా అలరించాయి.