Nani shyam singha roy: నాని, సాయిపల్లవి, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. పశ్చిమ బెంగాల్లో ఓ తెలుగు రచయిత సాగించిన పోరాటం నేపథ్యంగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. శుక్రవారం రిలీజైంది.
నాలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా.. అన్ని చోట్ల తొలిరోజు విశేష ప్రేక్షకాదరణ అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ కార్యాలయంలో చిత్రబృందం సంబరాలు చేసుకుంది.