Nani Shyamsingharoy hindi remake: నేచురల్ స్టార్ నాని నటించిన మరో సినిమా బాలీవుడ్లో రీమేక్ అయ్యేందుకు సిద్ధమైంది. ఇప్పటికే షాహిద్ కపూర్ హీరోగా రూపొందిన 'జెర్సీ' హిందీ రీమేక్ విడుదలకి సిద్ధం కాగా.. ఇప్పుడు 'శ్యామ్ సింగరాయ్'ను కూడా బాలీవుడ్లో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఓ బడా ప్రొడక్షన్ హౌస్ హిందీ రీమేక్ హక్కులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతోందట. ఇందులో షాహిద్ కపూర్ లేదా అజయ్ దేవగణ్ నటిస్తారని సమాచారం. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే స్పష్టత రానుంది.
బాలీవుడ్‌కు నాని 'శ్యామ్ సింగరాయ్'.. హీరో ఎవరంటే? - shahid kapoor Shyam Singha roy
Nani Shyamsingharoy hindi remake: నాని నటించిన 'శ్యామ్‌సింగరాయ్' హిందీ రీమేక్‌కు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఓ బాలీవుడ్ స్టార్ హీరో.. ఈ సినిమాలో నటిస్తారని సమాచారం. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.
![బాలీవుడ్‌కు నాని 'శ్యామ్ సింగరాయ్'.. హీరో ఎవరంటే? nani](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14623526-thumbnail-3x2-nai.jpg)
నాని
'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్యన్.. 'శ్యామ్‌సింగరాయ్'కు దర్శకత్వం వహించారు. సాయిపల్లవి, కృతిశెట్టి కీలక పాత్రల్లో నటించారు. 1970 కాలం నాటి కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిందీ చిత్రం. కాగా, నాని ప్రస్తుతం 'అంటే సుందరానికి', 'దసరా' చిత్రాల్లో నటిస్తున్నారు.
ఇదీ చూడండి: సూపర్ లుక్స్‌లో అవికా, పూజా, ఊర్వశి!
Last Updated : Mar 3, 2022, 1:47 PM IST