తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కోల్​కతాలో నాని 'శ్యామ్​ సింగరాయ్' - నాని లేటేస్ట్ న్యూస్

నాని ఫుల్​జోష్​తో షూటింగ్​లో పాల్గొంటున్నారు. ఆయన నటిస్తున్న శ్యామ్​ సింగరాయ్ షెడ్యూల్​ ప్రస్తుతం కోల్​కతాలో జరుగుతోంది.

Nani shyam singha roy
నాని సాయిపల్లవి కృతిశెట్టి

By

Published : Feb 13, 2021, 6:26 AM IST

నాని హీరోగా.. రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'శ్యామ్‌ సింగరాయ్‌'. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. దీని చిత్రీకరణ కోల్‌కతాలో మొదలైంది. సుదీర్ఘంగా సాగే తొలి షెడ్యూల్‌లో హీరోహీరోయిన్లతోపాటు, ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి.

"ప్రతిభ గల ఓ మంచి బృందం చేస్తున్న చిత్రమిది. నాని ఇప్పటి వరకు చేయని అత్యంత ఆసక్తికరమైన పాత్రను ఇందులో పోషిస్తున్నారు. అందుకోసం ఆయన ప్రత్యేకంగా సన్నద్ధమయ్యారు" అని చిత్రబృందం ఓ ప్రకటనలో తెలిపింది.

శ్యామ్​ సింగరాయ్ చిత్రబృందం

ABOUT THE AUTHOR

...view details