Nani Shyam Singh Roy look: రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా 'శ్యామ్ సింగరాయ్'. ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేశారు. అందులోని ఓ పాత్రనే శ్యామ్ సింగరాయ్. ఈ రోల్లో నాని గెటప్, ఆయన చెప్పిన డైలాగ్‌లు సినిమాపై ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని.. శ్యామ్ సింగరాయ్ పాత్ర గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పారు. ఈ లుక్‌లో కనిపించడం కోసం 15 గెటప్‌లను ప్రయత్నించినట్లు తెలిపారు.
"బంగాలీ రచయితగా కనిపించడం కోసం నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చాను. లుక్ ఇంటెన్స్‌గా కనిపించనప్పటికీ, మేకోవర్ కొంచెం కష్టమైంది. ఈ పాత్ర కోసం దాదాపు 15 గెటప్‌లను ట్రై చేశా. ఫైనల్‌గా దీన్ని ఓకే చేశా" అని నాని చెప్పారు.