తెలంగాణ

telangana

'నిన్ను కోరి' దర్శకుడికి నాని మరో అవకాశం..!

'నిన్ను కోరి' వంటి హిట్​ ఇచ్చిన శివ నిర్వాణతో హీరో నాని మరోసారి పనిచేసేందుకు సిద్ధమయ్యాడని సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

By

Published : Sep 17, 2019, 5:14 AM IST

Published : Sep 17, 2019, 5:14 AM IST

Updated : Sep 30, 2019, 10:05 PM IST

హీరో నాని

'గ్యాంగ్​లీడర్​'తో హిట్ కొట్టిన నేచురల్ స్టార్ నాని ఫుల్​జోష్​లో ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటికే 'జెర్సీ'తో విజయాన్ని అందుకున్నాడీ హీరో. ప్రస్తుతం 'వి' సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత చేసే చిత్రం కోసం రంగం సిద్ధం చేస్తున్నాడు. తనతో 'నిన్ను కోరి' వంటి క్లాస్​ మూవీ తీసిన శివ నిర్వాణకు మరోసారి అవకాశం ఇవ్వాలని చూస్తున్నాడు నాని.

నేచురల్ స్టార్ నాని- దర్శకుడు శివ నిర్వాణ

అక్కినేని జోడి నాగచైతన్య-సమంతతో ఈ ఏడాది 'మజిలీ' లాంటి హిట్​ కొట్టిన శివ.. నాని కోసం ఓ సరికొత్త ప్రేమకథను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబరులో సెట్స్​పైకి వెళ్లనుందని సమాచారం. సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. త్వరలో ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది.

ఇది చదవండి: వెండితెరపై మరోసారి 'వెల్లువచ్చి గోదారమ్మ'

Last Updated : Sep 30, 2019, 10:05 PM IST

ABOUT THE AUTHOR

...view details