తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రభాస్​ అన్నా... నీ సినిమా హిట్టవ్వాలి: నాని

యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్​ నటించిన 'సాహో' సినిమా పెద్ద హిట్​ కావాలని ట్వీట్ చేశాడు హీరో నాని. తన గ్యాంగ్​లీడర్​ విడుదల తేదీ  శుక్రవారం ప్రకటిస్తానని స్పష్టం చేశాడు.

By

Published : Aug 8, 2019, 5:37 PM IST

అన్నా... నీ సినిమా హిట్టవ్వాలి: హీరో నాని

'బాహుబలి' ప్రభాస్​ హీరోగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన చిత్రం 'సాహో.' ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది ఈ చిత్రబృందం. ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు సాహోను తీసుకురానుంది. అయితే అదే రోజున రావాల్సిన సినిమాలు ఇప్పటికే బరి నుంచి తప్పుకున్నాయి. తాజాగా నాని హీరోగా రూపొందిన 'గ్యాంగ్​లీడర్​'.. తేదీ మార్చుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్​ ద్వారా వెల్లడించాడు నేచురల్ స్టార్.

"సాహో మన చిత్రం. ఆ సినిమా హిట్​ అయితే మేం పండగ చేసుకుంటాం. ప్రభాస్​ అన్నకు, చిత్రబృందానికి శుభాకాంక్షలు. పెద్ద బ్లాక్​ బస్టర్​ కొట్టాలని ఆశిస్తున్నా. గ్యాంగ్​లీడర్​ విడుదల తేదీ శుక్రవారం ప్రకటిస్తా". -ట్విట్టర్​లో హీరో నాని.

హీరో నాని ట్వీట్

'గ్యాంగ్​లీడర్​'లో ఆర్.ఎక్స్.100 ఫేమ్​ కార్తికేయ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రియాంక మోహన్​ హీరోయిన్. విక్రమ్​ కె కుమార్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్​ ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఇది చదవండి: ఆగస్ట్​ 10న ట్రైలర్​తో వస్తున్న సాహో

ABOUT THE AUTHOR

...view details