క్లాస్, మాస్ సినిమాల్లో నటిస్తూ సహజనటుడిగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు నాని. ఆయనకు ఇటీవల ఒక అభిమాని ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్‌పై చేసిన సరదా కామెంట్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల నాని, హైదరాబాద్ నుంచి గోవాకు విమానంలో ప్రయాణించారు. ఆ సందర్భంలో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తున్న ఓ యువతి ఆయన్ను గుర్తించింది. వెంటనే ఒక నోట్ అందుకుని ఇలా రాసుకొచ్చింది.
నాని వయసును గుర్తు చేసిన ఎయిర్‌హోస్టెస్ - nani movie news
కథానాయకుడు నాని ఆసక్తికర విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఎయిర్‌హోస్టెస్ తనకు రాసిచ్చిన నోట్‌ను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు.
'డియర్ నానిగారు, మీ చిత్రాలు చూస్తూనే నేను పెరిగాను. మీరు ఎంతో అద్భుతంగా నటిస్తారు. ఈ గ్రీటింగ్ మీపై నాకున్న అభిమానానికి ఒక చిన్న టోకెన్ లాంటిది' అంటూ నాని చేతిలో పెట్టింది. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అతడు సరదాగా 'ఇలాంటి ఒక అందమైన ఎయిర్‌హోస్టెస్ ప్రేమతో రాసి ఇచ్చిన గ్రీటింగ్ చూస్తుంటే అధికారికంగా నా వయసు ఎక్కువని తెలియజేస్తున్నట్టుంది' అంటూ రాసుకొచ్చారు.
నాని నటిస్తున్న చిత్రాలలో 'టక్ జగదీష్' విడుదలకు సిద్ధమవగా, 'శ్యామ్ సింగ్ రాయ్' కోల్‌కతాలో షూటింగ్ జరుపుకొంటోంది. మరోవైపు వివేక్ ఆత్రేయతో 'అంటే సుందరానికి'.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఇందులో నానికి జోడిగా మలయాళీ భామ నజ్రియా నటిస్తోంది.