నేచురల్ స్టార్ నాని(Nani New Movie) నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏ పాత్ర అయినా తనదైన శైలితో మెప్పిస్తారు. ఇటీవల 'వి'లో ప్రతినాయక లక్షణాలున్న పాత్రలో మెప్పించిన అతడు.. త్వరలో అలాంటి రోల్ మరోసారి చేయనున్నారట.
తమిళ స్టార్ హీరో విజయ్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్(Thalapathy 66 Update)వస్తున్న చిత్రం కోసం నాని విలన్ పాత్ర చేయనున్నారట. అయితే ఈ విషయంపై మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అడ్వానీ లేదా రష్మికను తీసుకోనున్నట్లు సమాచారం. ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ అక్టోబరు 27 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మిస్తున్నారు.