ఈ ఏడాది జెర్సీ, గ్యాంగ్ లీడర్ లాంటి వరుస హిట్ చిత్రాలతో దూసుకెళ్తున్న టాలీవుడ్ హీరో నాని ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వి అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పుడు మరో సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు నేచురల్ స్టార్. తనకు నిన్నుకోరి లాంటి విజయాన్నిచ్చిన శివ నిర్వాణతో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.
ఇప్పటికే శివ.. నానికి కథ చెప్పేశాడని, స్టోరీ లైన్ నచ్చి సినిమా చేయాడానికినాని సిద్ధపడినట్లు ఫిల్మ్ వర్గాల టాక్. ఇందులో మరో కథానాయకుడూ నటించే అవకాశముందట. ఈ సినిమా కోసం ఆదిపినిశెట్టిని మళ్లీ తీసుకోబోతున్నాడట శివ. నిన్నుకోరి సినిమాలోనూ వీరిద్దరూ ఇదే దర్శకుడితో కలిసి పనిచేశారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమా సెట్సపైకి వెళ్లే అవకాశముందని సమాచారం.