నేచురల్ స్టార్ నాని స్పీడ్‌ను పెంచాడు. ఏడాదికి మూడు నాలుగు చిత్రాలు చేస్తున్నాడు. ఈ ఏడాది 'జెర్సీ', 'గ్యాంగ్ లీడర్' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 'వి' అనే మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం సెట్స్‌పై ఉండగానే మరో సినిమాకు పచ్చజెండా ఊపాడు. దీనికి సంబంధించిన వివరాలను ఈరోజు ప్రకటించింది చిత్రబృందం.
వినూత్న టైటిల్‌తో 'నిన్ను కోరి' టీమ్ మరోసారి - TuckJagadish
నేచురల్ స్టార్ నాని కొత్త సినిమాకు సంబంధించిన వార్త వచ్చేసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి ఓ వినూత్న టైటిల్‌ను ప్రకటించింది చిత్రబృందం.
నాని
ఈ చిత్రానికి 'టక్ జగదీష్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఇంతకుముందు వీరిద్దరి కలయికలో 'నిన్ను కోరి' వచ్చి ఘనవిజయం సాధించింది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారాపాటి, హరీష్ పెద్ది నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. తమన్ సంగీతం అందించనున్నాడు.
ఇవీ చూడండి.. సైకోగా మారబోతున్న నేచురల్ స్టార్..?