తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'శ్యామ్​ సింగరాయ్'గా నేచురల్ స్టార్ నాని - tollywood news

హీరో నాని నటిస్తున్న 27వ సినిమాకు టైటిల్​ ఖరారు చేశారు. అందుకు సంబంధించిన కాన్సెప్ట్ వీడియోను నేడు విడుదల చేశారు.

'శ్యామ్​ సింగరాయ్'గా నేచురల్ స్టార్ నాని
హీరో నాని

By

Published : Feb 24, 2020, 6:12 PM IST

Updated : Mar 2, 2020, 10:35 AM IST

బ్యాక్ టు బ్యాక్​ సినిమాలు చేస్తున్న టాలీవుడ్ హీరో నాని. ప్రస్తుతం 'వి', 'టక్ జగదీష్' షూటింగ్​ల్లో బిజీగా ఉన్న ఇతడు... తన పుట్టినరోజు కానుకగా మరో కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంక్రిత్యాన్​తో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పాడు. దీనికి 'శ్యామ్​ సింగరాయ్' అనే క్రేజీ టైటిల్​ పెట్టారు. కాన్సెప్ట్​ వీడియోనూ విడుదల చేశారు.

ఈ వీడియోలో నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. టైపు​ యంత్రంపై నిర్మాత, దర్శకుడు, హీరో పేర్లను చూపించారు. దీనిబట్టి ఈ సినిమా ఓ సరికొత్త కథతో తీస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. సితార ఎంటర్​టైన్​మెంట్స్ నిర్మిస్తోంది.

Last Updated : Mar 2, 2020, 10:35 AM IST

ABOUT THE AUTHOR

...view details