తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రయత్నిస్తూ ఓడిన 99 మంది కథే 'జెర్సీ' - జెర్సీ సినిమా

నేచురల్ స్టార్ నాని 'జెర్సీ' సినిమా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ చిత్రవిశేషాలు, అందులోని గుర్తుండిపోయే డైలాగ్​లు మీకోసం.

ప్రయత్నిస్తూ ఓడిన 99 మంది కథే ఈ 'జెర్సీ'
నాని జెర్సీ

By

Published : Apr 19, 2020, 10:44 AM IST

టాలీవుడ్​ యువహీరోల్లో నేచురల్ స్టార్ నానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అతడు సినిమా చేస్తున్నాడంటే ప్రేక్షకులు అంచనాలు పెంచుకుంటారు. అందుకు తగ్గట్లుగానే నమ్మకాన్ని నిలబెడుతూ వస్తున్నాడు నాని. అదే తరహాలో చేసిన అద్భుతమైన చిత్రం 'జెర్సీ'. సరిగ్గా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రవిశేషాలు మీకోసం.

నాని 'జెర్సీ' సినిమాకు ఏడాది పూర్తి

ఫామ్​లో ఉన్న హైదరాబాద్​ రంజీ క్రికెటర్ అర్జున్(నాని).. 26 ఏళ్ల వయసులో సారాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అప్పటి నుంచి అతడు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటాడు. ఓ దశలో ఆటకు స్వస్తి చెబుతాడు. కానీ ఎందుకు ఆపేయాల్సి వచ్చిందో ఎవరికీ చెప్పడు. ఆ తర్వాత కొన్నిరోజులకు ఉద్యోగం నుంచి సస్పెండ్ అవుతాడు. ఇంట్లో ఖాళీగా ఉంటూ కాలం వెల్లదీస్తుంటాడు. మళ్లీ 36 ఏళ్ల వయసులో బ్యాట్ పట్టిన అర్జున్.. తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు? జాతీయ జట్టుకు ఎంపికయ్యాడా? లేదా ?అనేదే సినిమా కథ.

ఇందులో హీరోహీరోయిన్లు నాని, శ్రద్ధా శ్రీనాథ్.. అద్భుతమైన నటన కనబరిచారు. పాత్రల్లో నటించారు అనడం కంటే జీవించారు అనే చెప్పాలి. అంత చక్కగా హావభావాల్ని పండించారు. గౌతమ్ తిన్ననూరి తన దర్శకత్వ ప్రతిభతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాడు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం.. చిత్రవిజయంలో కీలక పాత్ర పోషించింది.

జెర్సీలో నాని

జెర్సీ కొన్ని ఫేమస్ డైలాగ్స్

  • "అర్జున్ కథ.. వందలో సక్సెస్ అయిన ఒకడిది కాదు. సక్సెస్ అవ్వకపోయినా ప్రయత్నిస్తూ మిగిలిపోయిన 99 మందిది"
  • "ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు కాని ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు"
  • "ఇంత పెద్ద ప్రపంచంలో ఈరోజు దాకా నన్ను జడ్జ్ చేయంది నా కొడుకు ఒక్కడే. వాడికి వాళ్ల నాన్న ఉద్యోగం చేస్తున్నాడా? డబ్బులు సంపాదిస్తున్నాడా? సకెస్​ఫుల్లా? ఫెయిల్యూరా? ఇవేమి సంబంధం లేదు. వాడికి నేను నాన్న అంతే. వాడి దృష్టిలో నేను కొంచెం తగ్గిన తట్టుకోలేను సార్"
  • "వు ఆర్ సో అబ్సెసెడ్​ టూ సక్సెస్. మన దృష్టంతా ఎప్పుడూ సక్సెస్ అయిన వాళ్లమీదే ఉంటుంది. ఇన్ ఎవ్రీ ఏస్పెక్ట్ ఆఫ్ లైఫ్, వూ ఆల్వేస్ వాంట్ టూ నో మోర్ ఎబౌట్ పీపుల్ హూ ఆర్ వెరీ సక్సెస్​ఫుల్"
  • "కెప్టెన్ అయ్యేది అందరిలో బాగా ఆడేవాడు కాదు.. అందరూ బాగా ఆడేలా లీడ్ చేసేవాడు"

అయితే వీటిన్నింటికీ మించి ఈ సినిమాలోని రైల్వేస్టేషన్ సన్నివేశం ప్రత్యేకం. దీని గురించి గతంలో మాట్లాడిన నాని ఈ విధంగా చెప్పాడు.

"కథానాయకుడు క్రికెట్‌ జట్టుకు ఎంపికైన తర్వాత రైల్వే స్టేషన్‌కు వెళతాడు. అక్కడ ట్రైన్‌ వెళుతుండగా గట్టిగా అరిచే సన్నివేశం. గౌతమ్‌ నాకు ఈ సీన్‌ చెప్పగానే ఇది ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తుంది అనే నమ్మకం కలిగింది. ఈ సన్నివేశాన్ని అంతగా జనాదరణ లేని ఓ రైల్వే స్టేషన్‌లో చిత్రీకరించారు. వాస్తవికత కోసం నిజమైన రైల్వే స్టేషన్‌లోనే చిత్రీకరించేందుకు నిర్ణయించుకున్నాం. కానీ ఆస్టేషన్‌కు రోజుకు మూడు రైళ్లు మాత్రమే వస్తాయి. రైలు వచ్చినప్పుడు సన్నివేశాన్ని చిత్రీకరించలేకపోతే మరో మూడు గంటలు వేచి చూడాల్సిందే. హీరో ఎమోషనల్‌గా గట్టిగా అరిచే సన్నివేశం అది. డైలాగ్‌ అయితే ఒకసారి ప్రాక్టీస్‌ చేసుకుని వెంటనే చెప్పేయొచ్చు. కానీ ఆ సీన్‌ అలా కాదు. చాలా బాగా పండాలి. ట్రైన్‌ వస్తున్న సమయంలో అంతా సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నాం. కానీ అదే సమయంలో మరో ట్రైన్‌ వచ్చి అడ్డంగా ఆగింది. దీంతో మరో రైలు వచ్చేవరకు వేచిచూడక తప్పలేదు" అని చెప్పాడు నాని.

ABOUT THE AUTHOR

...view details