తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అభిమానులు​ గర్వపడేలా చేస్తా: నాని - హీరో నాని

అందరిలా తనకోసం అభిమానులు కటౌట్లు కట్టడం.. పాలాభిషేకాలు చేయడం అవసరం లేదని అంటున్నారు కథానాయకుడు నాని. హీరోగా తన ఫ్యాన్స్​ గర్వపడేలా ప్రతిరోజూ కష్టపడుతూనే ఉంటానని.. 'టక్​ జగదీష్'​ పరిచయ వేడుక కార్యక్రమంలో ఆయన వెల్లడించారు.

Family Of Tuck Jagadish
హీరో నాని

By

Published : Mar 28, 2021, 7:27 AM IST

"నా అభిమానులుగా ఉన్న మీరంతా గర్వపడేలా చేసేందుకు ప్రతిరోజూ కష్టపడుతూనే ఉంటాన"ని అన్నారు కథానాయకుడు నాని. శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా 'టక్‌ జగదీష్‌' చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ఏప్రిల్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం 'పరిచయ వేడుక' కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నాని మాట్లాడారు.

"ఏడాది పాటు అభిమానులను చాలా మిస్‌ అయ్యాను. మళ్లీ ఇప్పుడు ఇలా చూస్తుండడం చాలా సంతోషంగా ఉంది. అందరిలా నాకోసం గొడవలు పడటమో.. కటౌట్లు పెట్టడం.. పాలాభిషేకాలు చేయడం నాకు అవసరం లేదు. నన్ను చూసి మీరు గర్వపడేలా చేసేందుకు ప్రతిరోజూ కష్టపడతానని ప్రమాణం చేస్తున్నా."

- నాని, కథానాయకుడు

ఈ సందర్భంగా సినిమాలోని అన్ని పాత్రలను అభిమానులకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమానికి 'పరిచయ వేడుక' అని పేరు పెట్టడానికి కారణం అదేనని ఆయన అన్నారు.

ఈ చిత్రంలో నాని సరసన రీతూవర్మ, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. తమన్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మిస్తున్నారు.

ఇదీ చూడండి:'ఆదిపురుష్​', 'సలార్​' కోసం అక్కడా..ఇక్కడా!

ABOUT THE AUTHOR

...view details