హాలీవుడ్ చిత్రాలకు ప్రాంతీయ భాషల్లోని ప్రముఖ నటులతో డబ్బింగ్ చెప్పిస్తే ఆ సినిమాకు క్రేజ్ పెరుగుతుంది. సరిగ్గా ఇదే ఆలోచనతో వస్తోంది 'లయన్ కింగ్' చిత్రబృందం. త్రీడీ టెక్నాలజీతో వస్తున్న ఈ చిత్రంలోని సింబా పాత్రకు.. టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని గాత్రమందించనున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్లో పంచుకున్నాడీ నటుడు. బాలీవుడ్లో ఇదే పాత్రకు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పనున్నాడు.
"ఇదే ఏడాది నన్ను ఓ తండ్రిగా చూశారు. ఇప్పుడు కొడుకుగా చూడబోతున్నారు."