హీరో నాని నటించిన 'గ్యాంగ్‌లీడర్' విడుదలైన మూడు రోజుల్లో వసూళ్లతో పరుగులెత్తింది. వారాంతం కావడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.11.8 కోట్ల షేర్ రాబట్టింది. అయితే సోమవారం మాత్రం ఆ వసూళ్ల సంఖ్య అనూహ్యంగా తగ్గిపోయింది. దాదాపు 1.18 కోట్లకే పరిమితమైంది. ఫలితంగా నాలుగు రోజుల్లో మొత్తం రూ.12.9 కోట్ల షేర్ రాబట్టినట్లయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ను అందుకోవడం కాస్త సవాల్‌తో కూడుకున్నదేనని అభిప్రాయపడుతున్నారు సినీ విశ్లేషకులు.
ఇప్పటికి ముప్పావు వంతే...
ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్‌ను రూ.20.9 కోట్లకు విక్రయించగా.. ఇప్పటి వరకు 61శాతం కలెక్షన్లను రాబట్టగలిగింది. నష్టాల నుంచి తప్పించుకోవాలంటే మిగిలిన మూడు రోజుల్లో రూ.7 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. ఈ శుక్రవారం వరుణ్ తేజ్ 'వాల్మీకి' ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఆ సినిమా టాక్ ఆధారంగా ఓ మోస్తరు ప్రభావం గ్యాంగ్‌లీడర్‌పై పడే ఆస్కారం ఉందని అంచనా.