తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇంటిపేరు మార్చుకుంటున్న నాని ఫ్యాన్స్​! - నాని టక్​ జగదీశ్​

'టక్​ జగదీశ్' ​(tuck jagadish Nani) సినిమా ప్రచారంలో నాని అభిమానులు భాగస్వామ్యం అయ్యారు. ఆయన పిలుపును స్వాగతించిన ఫ్యాన్స్​​ సోషల్​మీడియాలో తమ ఇంటి పేరును 'టక్​ జగదీశ్'​గా మార్చుకుని అభిమానాన్ని చాటుకుంటున్నారు.

nani
నాని

By

Published : Aug 31, 2021, 5:51 PM IST

నేచురల్ స్టార్ నాని(Tuck jagadish Nani) అభిమానులు తమ ఇంటి పేరు మార్చుకుంటున్నారు. వినడానికి వింతగా అనిపించినా.. సామాజిక మాధ్యమాల్లో ఇంటి పేరు స్థానంలో నాని కొత్త సినిమా 'టక్ జగదీశ్'ను పెట్టుకుని అభిమానాన్ని చాటుకుంటున్నారు.

సెప్టెంబర్ 10న 'టక్ జగదీశ్' అమెజాన్ ప్రైమ్​లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్, ఇన్​స్టా వేదికగా నాని.. అభిమానులకు పిలుపు నిచ్చారు. ప్రొఫైల్ నేమ్ మార్చుకొని 'టక్ జగదీశ్' ప్రచార చిత్రంపై(nani tuck jagadish trailer) ఏమనుకుంటున్నారో ఒక్కమాటలో చెప్పాలని విజ్ఞప్తి చేశారు. అభిమానులు పోస్టు చేసే ప్రతి విషయాన్ని చదివి జవాబు ఇస్తానని వెల్లడించారు.

నాని పిలుపునకు స్పందించిన అభిమానులు ఫ్రొఫైల్ పేరులో 'టక్ జగదీశ్'ను(nani tuck jagadish) చేర్చుకుని అభిమానాన్ని చాటుకుంటున్నారు. టక్ జగదీశ్​ను ఓటీటీలో విడుదల చేస్తున్న అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా తన ట్విట్టర్ ఖాతా ప్రొఫైల్ పేరు మార్చుకొని సినిమా ప్రచారంలో తన వంతు భాగస్వామిగా నిలిచింది. సెప్టెంబర్ 1న హైదరాబాద్​లోని నోవాటెల్ హెచ్ఐసీసీ ప్రాంగణంలో చిత్ర బృందం ఈ చిత్ర ట్రైలర్​ను విడుదల చేసేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.

ఇదీ చూడండి: నానికి.. తెలంగాణ థియేటర్స్​ అసోసియేషన్​ క్షమాపణలు​!

ABOUT THE AUTHOR

...view details