ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం ఓ సర్‌ప్రైజ్ ఇస్తున్నట్లు ఇటీవల తెలిపాడు నటుడు నాని. తాజాగా దానికి సంబంధించిన వివరాల్ని ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నాడు. కొవిడ్ వేళ అనేకమంది ప్రాణాల్ని రక్షిస్తున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లకి బహుమతిగా 'దారే లేదా' అనే వీడియో గీతాన్ని రూపొందించినట్టు తెలిపాడు.
Nani: ఫ్రంట్‌లైన్ వర్కర్ల కోసం 'దారే లేదా' - ఫ్రంట్‌లైన్ వర్కర్ల కోసం 'దారే లేదా' సాంగ్
ఫ్రంట్‌లైన్ వర్కర్ల కోసం ఓ గీతాన్ని రూపొందించాడు నేచురల్ స్టార్ నాని. ఈ పాటను త్వరలోనే విడుదల చేయనున్నట్లు వెల్లడించాడు నాని.
నాని
విజయ్ బుల్గనిన్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకి కె.కె. సాహిత్యం అందించాడు. నటులు సత్యదేవ్, రూప (ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఫేం) ఈ గీతంలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ వీడియో విడుదల కానుంది. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని సమర్పణలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది ఈ గీతం.