తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రాధేశ్యామ్'​ రిజల్ట్​పై ప్రభాస్​ రియాక్షన్​!.. నాని 'దసరా' అప్డేట్​ - Radheshyam prabhas reaction

'రాధేశ్యామ్' డివైడ్​ టాక్​ రావడంపై దర్శకుడు రాధాకృష్ణ​ స్పందించారు. సినిమా గురించి ప్రభాస్​ తనతో ఏం చెప్పారో తెలిపారు. కాగా, హీరో నాని నటిస్తున్న 'దసరా' మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్​ వచ్చింది.

Nani Dasara movie update
Nani Dasara movie update

By

Published : Mar 19, 2022, 4:33 PM IST

Nani Dussera movie update: ఇటీవలే 'శ్యామ్‌ సింగరాయ్‌'తో విజయాన్ని అందుకున్న హీరో నాని.. ప్రస్తుతం శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో 'దసరా' సినిమా చేస్తున్నారు. వైవిధ్యమైన, కథతో రూపొందుతున్న ఈ మూవీలో కీర్తిసురేష్‌ కథానాయిక. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్​ వచ్చింది. మార్చి 20న ఉదయం 11.34గంటలకు 'స్పార్క్​ ఆఫ్​ దసరా' పేరుతో ఓ మాస్​ సర్​ప్రైజ్​ ఇవ్వనున్నట్లు తెలిపింది చిత్రబృందం. దీంతోపాటే ఓ మాస్​ పోస్టర్​ను రిలీజ్​ చేసింది. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. సింగరేణి బొగ్గు గనులున్న ప్రాంతంలోని ఒక గ్రామం నేపథ్యంలో సాగే కథ ఇది అని తెలిసింది. నాని యాక్షన్‌తో కూడిన పాత్రను పోషిస్తున్నారు. సముద్రఖని, సాయికుమార్‌, జరీనా వాహబ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్​ నారాయణన్​ సంగీతం అందిస్తున్నారు.

Prabhas Radheshyam movie: ప్రభాస్-పుజాహెగ్డే వింటేజ్ లవ్​స్టోరీ​ 'రాధేశ్యామ్​'. ఈ సినిమా మిశ్రమ స్పందనలను అందుకుంది. తాజాగా ఈ డివైడ్​ టాక్​పై దర్శకుడు రాధాకృష్ణ స్పందించారు.

"మా సినిమాపై ప్రశంసలు, విమర్శలు రెండూ ఒకేలా వస్తున్నాయి. సినిమా రిలీజ్​ అయిన సమయంలో కొంతమంది నుంచి నెగెటివిటీ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. కానీ, ఇప్పుడు ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతున్నారు. సినిమా చాలా బాగుందని, ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతున్నామని.. మెస్సేజ్‌లు పెడుతున్నారు. ముఖ్యంగా నా భార్య నుంచి వచ్చిన ప్రశంసను మర్చిపోలేను. మూవీ విడుదలయ్యాక ప్రభాస్‌ను కలవలేదు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం హాలీడే ట్రిప్​లో ఉన్నారు. మేమిద్దరం ఫోన్స్‌లోనూ మాట్లాడుకోలేదు.. కానీ సమయం దొరికినప్పుడు మెస్సేజ్‌లు చేసుకుంటున్నాం. 'మొదటి మూడు రోజులు నా ఇమేజ్‌ సినిమాని డామినేట్‌ చేసేస్తుంది' అని ప్రభాస్‌ నాకు చాలా సార్లు చెప్పాడు" అని రాధాకృష్ణ కుమార్‌ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: మహేశ్​ సినిమాలో బాలయ్య.. జక్కన్న క్లారిటీ!

ABOUT THE AUTHOR

...view details