విలక్షణ పాత్రలతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు నాని. 'జెర్సీ'తో హిట్ కొట్టి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణతో 'వి', విక్రమ్ కె కుమార్‌తో 'గ్యాంగ్‌లీడర్' సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.
'ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు' - v movie
కుటుంబ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో సినిమా చేస్తున్నాననే వార్త అసత్యమని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు హీరో నాని. ప్రస్తుతం 'వి', 'గ్యాంగ్‌లీడర్' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు నేచురల్ స్టార్.
ఆ దర్శుకుడితో సినిమా చేస్తున్నాననేది వదంతే..!
కుటుంబ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో సినిమా చేస్తున్నాడంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. పుకార్లకు తెరదించుతూ అవన్నీ అసత్య వార్తలేనని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు నేచురల్ స్టార్.
ఇది చదవండి: 'గ్యాంగ్‌లీడర్' నాని వచ్చేది ఎప్పుడంటే...