Nani ante sundaraniki movie: యువ కథానాయకుడు నాని పుట్టినరోజు గురువారం(ఫిబ్రవరి). ఈ క్రమంలోనే అతడు హీరోగా నటిస్తున్న 'అంటే సుందరానికి' టీమ్.. 'బర్త్డే హోమమ్' పేరుతో హాస్యభరితంగా ఉన్న ఓ వీడియోను రిలీజ్ చేసింది. జూన్ 10న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ సినిమాలో నాని, బ్రాహ్మణ యువకుడిగా నటిస్తున్నారు. అతడి సరసన మలయాళ బ్యూటీ నజ్రియా నజిమ్ హీరోయిన్గా చేస్తుంది. వివేక్ సాగర్ సంగీతమందిస్తుండగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
Adavallu meeku joharlu songs: కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించినప్పుడు సగటు యువకుడి పరిస్థితి ఎలా ఉంటుందో పాట రూపంలో వినిపించారు నటుడు శర్వానంద్. అతడు హీరోగా నటించిన కొత్త సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఇందులో 'మాంగళ్యం తంతునా..' అంటూ సాగే లిరికల్ పాటను బుధవారం రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో శర్వానంద్ సరసన రష్మిక హీరోయిన్గా నటించింది. మార్చి 4న చిత్రం, ప్రేక్షకుల ముందుకు రానుంది. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు.