తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నాని కొత్త సినిమా జీరో లుక్.. 'వాలిమై' ట్రైలర్ - అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే రవితేజ ఎపిసోడ్

Cinema news: కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో అంటే సుందరానికీ, వాలిమై, పుష్ప, జయమ్మ పంచాయతీ, విక్రమ్ వేదా హిందీ రీమేక్, అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే టాక్ షోకు సంబంధించిన కొత్త సంగతులు ఉన్నాయి.

nani ajith vaalimai
నాని అజిత్

By

Published : Dec 30, 2021, 7:04 PM IST

Nani new movie: 'శ్యామ్​సింగరాయ్'తో థియేటర్లలో సందడి చేస్తున్న నేచురల్ స్టార్ నాని.. కొత్త సినిమా అప్డేట్​తో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. న్యూ ఇయర్ కానుకగా 'అంటే సుందరానికీ' చిత్ర జీరో లుక్​ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.

నాని 'అంటే సుందరానికీ' మూవీ

ఇందులో నాని.. KPVSSPR సుందర్ ప్రసాద్ అనే పాత్రలో నటిస్తున్నారు.​ కామెడీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో మలయాళ బ్యూటీ నజ్రియా.. తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. వచ్చే వేసవిలో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.

Valimai Official Trailer: హీరో అజిత్ కుమార్ నటించిన తమిళ సినిమా 'వాలిమై' ట్రైలర్ వచ్చేసింది. ఇందులో అజిత్ పోలీస్ అధికారిగా నటించగా, తెలుగు కథానాయకుడు కార్తికేయ.. విలన్​గా కనిపించనున్నారు. హ్యుమా ఖురేషి, యోగిబాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు.

ఆద్యంతం యాక్షన్ ఎపిసోడ్స్​తో ఉన్న ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఈ సినిమాకు 'ఖైదీ' ఫేమ్ వినోద్ దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా తమిళంలో రిలీజ్ కానుంది. మరి తెలుగులో ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి?

Dakko dakko meka song: 'పుష్ప' సినిమాలోని 'దాక్కో దాక్కో మేక' పూర్తి వీడియో సాంగ్ వచ్చేసింది. ఆద్యంతం ఆకట్టుకుంటూ అభిమానుల్ని అలరిస్తుంది. అడవిలో బన్నీ గెటప్, ఎర్ర చందనం స్మగ్లింగ్​కు సంబంధించిన దృశ్యాలు ఇందులో చూపించారు.

శేషాచలం బ్యాక్​డ్రాప్​తో తీసిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్​గా చేసింది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

Jayamma panchayathi movie: ప్రముఖ వ్యాఖ్యాత సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'జయమ్మ పంచాయితీ'. విజయ్ కలివరపు దర్శకత్వంలో బలగ ప్రకాశ్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా సినిమా మేకింగ్ విడుదల చేసింది. చిత్రీకరణ సమయంలో 24 విభాగాలను సరదాగా ఏంటీ ఈ పంచాయితీ అంటూ సందడి చేస్తున్న దృశ్యాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

'అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే' కొత్త ఎపిసోడ్​.. శుక్రవారం రాత్రి 8 గంటలకు రిలీజ్ కానుందని ఆహా ఓటీటీ వెల్లడించింది. ఈ ఎపిసోడ్​లో హీరో రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని సందడి చేయనున్నారు. 'విక్రమ్ వేదా' హిందీ రీమేక్​ రెండో షెడ్యూల్​ లక్నోలో పూర్తయింది. సైఫ్ అలీఖాన్​పై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఇందులో హృతిక్ రోషన్.. ప్రతినాయక లక్షణాలున్న పాత్ర పోషిస్తున్నారు. పుష్కర్-గాయత్రి దర్శకత్వం వహిస్తున్నారు.

అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే రవితేజ ఎపిసోడ్
'విక్రమ్ వేదా' డైరెక్టర్స్​తో సైఫ్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details