తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సినిమా 'మాస్టర్'. ఈ చిత్రంలో దళపతికి దీటుగా ప్రతినాయకుడి(భవాని)గా విజయ్ సేతుపతి కనిపించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. అయితే ఈ సినిమాలోని పవర్ఫుల్ విలన్ పాత్రలో తొలుత సేతుపతిని తీసుకోలేదు. నేచురల్ స్టార్ నాని, మరో ప్రముఖ నటుడు మాధవన్.. వీరిలో ఒకరిని తీసుకోవాలని చిత్రబృందం భావించింది. కానీ ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల ఆ స్థానంలో సేతుపతిని ఎంపిక చేశారు.
ఇప్పటికే నాని 'జెంటిల్మెన్', 'వి'(నెగటివ్ షేడ్స్) సినిమాల్లో ప్రతినాయక పాత్ర పోషించి అభిమానులను అలరించారు. మరోవైపు లవర్‌బాయ్‌గా అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకున్న మాధవన్ కూడా 'సవ్యసాచి', 'నిశ్శబ్దం' సినిమాల్లో స్టైలిష్ విలన్‌గా కనిపించి తనలోని మరో కోణాన్ని బయటపెట్టారు. త్వరలో రాబోయే కొన్ని బడా చిత్రాల్లోనూ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని వినికిడి.