'నమ్మకంతో చెప్తున్నా... జెర్సీ ఎప్పటికీ పాతబడదు' - జెర్సీ సినిమా
ఒకరోజు ఈ చిత్రంలో నటించిన మేమంతా పాతబడిపోవచ్చు...కాని 'జెర్సీ' ఎప్పటికీ సజీవంగా నిలిచే సినిమా అన్నాడు నేచురల్ స్టార్ నాని. హైదరాబాద్‌లో నిర్మాత దిల్‌రాజు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఈ విషయం చెప్పాడు.
'నమ్మకంతో చెప్తున్నా...జెర్సీ ఎప్పటికీ పాతబడదు'
నాని, శ్రద్ధాశ్రీనాథ్ జంటగా నటించిన చిత్రం జెర్సీ. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. జెర్సీ చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ సోమవారం హైదరాబాద్‌లో అభినందన సమావేశాన్ని ఏర్పాటుచేశారు దిల్‌రాజు. కార్యక్రమంలో మాట్లాడిన నాని... "జెర్సీ ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో పదిలంగా ఉండిపోయే సినిమా" అన్నాడు.