'గ్యాంగ్ లీడర్' కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు తీపి కబురు చెప్పాడు హీరో నాని. సినిమా ప్రీలుక్‌ను శనివారం ఉదయం విడుదల చేస్తామని ఓ వీడియోను ట్విట్టర్లో పంచుకున్నాడు. ఒకసారి మొదలుపెడితే సినిమా రిలీజ్ వరకు ప్రచారం ఆగకూడదనే ఇప్పటి వరకు ఆలస్యం చేశామని, ఇక నుంచి మ్యూజిక్ స్టార్ట్ కానుందని చెప్పాడు.
నాని 'గ్యాంగ్‌లీడర్'కు రేపే మ్యూజిక్ స్టార్ట్ - PRE LOOK OF GANG LEADER
హీరో నాని 'గ్యాంగ్ లీడర్' ప్రీలుక్‌ను శనివారం విడుదల చేయనున్నారు. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
నాని 'గ్యాంగ్‌లీడర్'కు రేపే మ్యూజిక్ స్టార్ట్
ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. హీరో నాని ఐదు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడని సమాచారం. 'ఆర్.ఎక్స్ 100' హీరో కార్తికేయ కీలక పాత్ర పోషిస్తున్నాడు. డిఫరెంట్ చిత్రాలతో అలరించే విక్రమ్ కుమార్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: ఐదు భాషల్లో కిచ్చా 'పహిల్వాన్' రెడీ