Nani: యువ కథానాయకుడు నాని(Nani) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. గతేడాది డిసెంబరులో 'శ్యామ్ సింగరాయ్'తో మెప్పించిన ఆయన ఇటీవలే 'అంటే సుందరానికీ!' చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. త్వరలోనే మరో సినిమా కోసం రంగంలోకి దిగబోతున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న 29వ చిత్రం 'దసరా'. కీర్తిసురేశ్ కథానాయిక. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.
పూర్తి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ కథలో నాని డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేకంగా విలేజ్ సెట్‌ను తీర్చిదిద్దుతోందట. ఇందుకోసం ఏకంగా రూ.12కోట్లు ఖర్చు చేయనున్నట్లు టాలీవుడ్ టాక్. మెజార్టీ భాగం ఇక్కడే చిత్రీకరించనున్నారు. దీంతో ఈ విషయంలో చిత్ర బృందం అస్సలు రాజీపడకూడదని భావిస్తోందట.