నేచురల్ స్టార్ నాని 25వ చిత్రానికి టైటిల్ ఖరారైంది. ఇంగ్లీష్ అక్షరం 'V' పేరుతో తెరకెక్కనుంది సినిమా. టైటిల్ చూస్తుంటే క్రైమ్ థ్రిల్లర్‌గా మూవీ రూపొందనుందని తెలుస్తోంది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తుండగా.. నటుడు సుధీర్ బాబు మరో కీలకపాత్ర పోషిస్తున్నాడు.
"మోహనకృష్ణ నా తొలి చిత్రంతో నన్ను హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు. ఈరోజు నా 25 చిత్రంతో మళ్లీ నన్ను కొత్తగా పరిచయం చేయబోతున్నాడు. కాకపోతే ఈసారి కాస్త విభిన్నంగా.. నా స్నేహితుడు(సుధీర్‌బాబును ఉద్దేశిస్తూ) కూడా పార్టీ (సినిమా)లో చేరబోతున్నాడు’ అంటూ ట్వీట్ చేశాడు నాని.