సహాయనటుడిగా, హీరోగా రాణిస్తున్న నటుడు నందు. ప్రస్తుతం రాజ్ విరాట్ దర్శకత్వంలో 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమా చేస్తున్నారు. శుక్రవారం అతడి పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు. రష్మీ గౌతమ్ హీరోయిన్గా కనిపించనుంది.
ఈ 'పోతురాజు'.. డైరెక్టర్ పూరీకి వీరాభిమాని - nandhu rashmi
నందు విజయ్ కృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'బొమ్మ బ్లాక్‌బస్టర్' ఫస్ట్‌లుక్ విడుదలైంది. మాస్ పాత్రలో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు.
![ఈ 'పోతురాజు'.. డైరెక్టర్ పూరీకి వీరాభిమాని ఈ 'పోతురాజు'.. డైరెక్టర్ పూరీకి అభిమాని](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8662584-0-8662584-1599122044031.jpg)
నటుడు నందు
ఇందులో పోతురాజు పాత్రలో దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు వీరాభిమానిగా నందు నటిస్తున్నారు. పోస్టర్లో చాలా మాస్‌గా కనిపిస్తున్నారు. ప్రశాంత్ విహారి సంగీత దర్శకుడు. ప్రవీణ్ పగడాల, బోసుబాబు, ఆనంద్ రెడ్డి, మనోహర్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Last Updated : Sep 3, 2020, 2:16 PM IST