తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాబాయి సినిమాలా.. అబ్బాయి చిత్రం ఉంటుందా..! - nandamuri kalyanram

టాలీవుడ్ హీరో నందమూరి కల్యాణ్ రామ్​ ప్రస్తుతం 'ఎంత మంచివాడవురా' సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత టైమ్ మిషన్ నేపథ్యంలో తెరకెక్కే చిత్రంలో నటించనున్నాడని సమాచారం.

కల్యాణ్

By

Published : Nov 12, 2019, 7:07 PM IST

నందమూరి హీరో కల్యాణ్‌ రామ్‌ చేసే ప్రతి చిత్రానికి ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. ఈ హీరో ఎక్కువగా కుటుంబ కథా సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంటాడు. అలాగే ప్రత్యేక పాత్రల్లో 'అతనొక్కడే' 'కల్యాణ్‌ రామ్‌ కత్తి', 'ఇజం'లాంటి చిత్రాల్లోనూ నటించాడు. తాజాగా ఫిల్మ్ నగర్‌లో ఓ వార్త హల్‌చల్‌ చేస్తుంది. కల్యాణ్‌ 'ఎంతమంచి వాడవురా' తర్వాత టైమ్‌ మిషన్‌ నేపథ్యంలో తెరకెక్కించే సినిమాలో నటించనున్నాడట.

ఈ సినిమా ఇంతకుముందు బాలకృష్ణ నటించిన 'ఆదిత్య 369' చిత్రాన్ని పోలి ఉంటుందని చెప్పుకుంటున్నారు. కథ ఐదు శతాబ్దాల ముందు.. ఆ తర్వాత కొనసాగుతుందని తెలుస్తోంది. అంటే గతం.. వర్తమానంలో జరిగే విశేషాల నేపథ్యంగా అన్నమాట. చిత్రానికి వేణు మల్లిడి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని వినికిడి.

ప్రస్తుతం కల్యాణ్‌ రామ్‌ సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో 'ఎంత మంచివాడవురా' చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలకానుంది.

ఇవీ చూడండి.. 'యాక్షన్ సన్నివేశాల కోసం చాలా కష్టపడ్డాం'

ABOUT THE AUTHOR

...view details