తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సైలెంట్​గా షూటింగ్ ముగించిన 'మంచోడు'

హీరో కల్యాణ్​రామ్.. 'ఎంత మంచివాడవురా' షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోందీ చిత్రం. సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

By

Published : Nov 26, 2019, 5:02 PM IST

kalyan ram-mehreen
కల్యాణ్​రామ్-మెహ్రీన్

నందమూరి కల్యాణ్​రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఎంత మంచివాడవురా'. ఇప్పటికే వచ్చిన టీజర్​ అలరిస్తోంది. కేరళలో చివరి షెడ్యూల్​ జరుపుకున్న ఈ సినిమా.. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. నిర్మాణనంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

మెహరీన్ హీరోయిన్​. గోపీసుందర్ సంగీతమందించాడు. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించాడు. ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్​ లిమిటెడ్​ నిర్మిస్తోంది. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: ఆ దర్శకుడికి దండం పెట్టిన హీరోయిన్ మెహరీన్

ABOUT THE AUTHOR

...view details