తెలంగాణ

telangana

ETV Bharat / sitara

KALYAN RAM BIRTHDAY: 'నాన్నలేని లోటు తారక్​ తీరుస్తున్నాడు'

'బాలగోపాలుడు' చిత్రంతో బాలనటుడిగా అరంగేట్రం చేసి.. 'తొలిచూపులోనే' సినిమాతో హీరోగా పరిచయమై.. 'అతనొక్కడే'తో సత్తాచాటారు కల్యాణ్​రామ్.. 'పటాస్'​తో వసూళ్ల పటాసులు పేల్చారు.. 'జై లవకుశ'తో అన్నదమ్ముల బంధాన్ని చాటి చెప్పారు కల్యాణ్​రామ్​.. సోమవారం ఆయన 44వ పుట్టినరోజు.

NANDAMURI KALYAN RAM UNKNOWN FACTS
కల్యాణ్​రామ్ బర్త్​డే

By

Published : Jul 5, 2021, 5:31 AM IST

నందమూరి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని.. విభిన్న కథలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు కల్యాణ్ రామ్. హీరోగానే కాకుండా నిర్మాతగానూ మెప్పిస్తున్నారు. ఆదివారం అతడి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన గతంలో చెప్పిన ఆసక్తికర విషయాలు మీకోసం మరోసారి.

*'పాతాళ భైరవి' నాకు చాలా ఇష్టమైన చిత్రం. అందులో తాత చాలా అందంగా ఉంటారు. ‘మాయాబజార్‌’, ‘గుండమ్మ కథ’ సినిమాలన్నా ఇష్టమే. బాబాయ్‌ నటించిన చిత్రాల్లో ‘ఆదిత్య 369’ అంటే చాలా ఇష్టం. ఆ సినిమా కోసం బాబాయ్‌ అస్సలు మేకప్‌ వేసుకోలేదు. పీసీ శ్రీరామ్‌గారు చాలా చక్కగా చూపించారు.

*నాన్న ఏ పనినైనా చాలా శ్రద్ధగా చేస్తారు. ముక్కు సూటిగా ఉంటారు. అబద్ధాలు చెప్పరు. ముందొక మాట, వెనకొక మాట మాట్లాడరు. ఆయన నుంచి ఇవే నేర్చుకున్నా. ఒక మనిషి నాకు నచ్చకపోతే అక్కడి నుంచి వెళ్లిపోతా. పక్కకు వెళ్లి మాత్రం చెడుగా చెప్పను. నాన్న.. కుటుంబ కోసం పరితపించేవారు. తారక్‌తో మా బ్యానర్‌లో ‘జై లవకుశ’ చేసేటప్పుడు ఆయన ఆనందానికి అవధులు లేవు. ఈ సినిమాతోనే కొత్త ఆఫీస్‌ ఓపెన్ చేశా. ఆ రోజంతా ఆయన అక్కడే ఉన్నారు. మేమంతా కలిసి ఉండాలని ఆయన కోరుకునేవారు. ముఖ్యంగా తారక్‌, నేనూ కలిసి సినిమా చేయాలని ఉండేది.

తమ్ముడు తారక్​తో కల్యాణ్​రామ్

*మొదటి నుంచీ తారక్​ను నాన్నా అని పిలవడం అలవాటైంది. తారక్‌ నాతో కొన్నిసార్లు తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా ఉంటాడు. ఇంకొన్నిసార్లు చిన్న పిల్లాడు అయిపోతాడు. అతనిలో అన్ని ఎమోషన్స్‌ కలిసిపోయి ఉంటాయి. అందుకే తారక్‌ను ఎప్పుడూ తమ్ముడూ అని పిలవను. వేదికలపై కూడా ‘నాన్నా’ అనే పిలుస్తా. మా నాన్నగారంటే నాకు చాలా ఇష్టం. ఆయన లేని లోటు తారక్‌ తీరుస్తున్నాడు. ఒకరికి ఒకరం అండగా ఉంటాం.

*మంచి కథ ఉంటే బాబాయ్ బాలకృష్ణ, తమ్ముడు తారక్​, నేను.. ముగ్గురం కలిసి పనిచేస్తాం. అయితే, నేను మాత్రం ఒక సాంగ్‌లో అలా కనిపించి వెళ్లిపోతా. నా బ్యానర్‌లో చేస్తే, నాకున్న కోరికలన్నీ తీరిపోయినట్లే. 'మనం' చూసినప్పుడు 'అరె.. మనకు అలాంటి అవకాశం రాలేదే' అని అనుకున్నా.

బాబాయ్, సోదరుడితో కల్యాణ్​రామ్

జీవిత విశేషాలు

కల్యాణ్​రామ్​.. 1978 జూన్ 5న హైదరాబాద్​లో జన్మించారు. కోయంబత్తూరులో ఇంజినీరింగ్ పూర్తి చేసి.. అమెరికాలోని ఇల్లినాయిస్ ఇన్​స్టిట్యూట్​లో మాస్టర్స్ చేశారు. స్వాతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. శౌర్య రామ్, తారక అద్వైత సంతానం.

భార్య స్వాతితో కల్యాణ్​రామ్

చిన్నతనంలోనే బాలకృష్ణ 'బాలగోపాలుడు'(1989) సినిమాలో కల్యాణ్​రామ్ బాలనటుడిగా కనిపించి సందడి చేశారు.

బాలగోపాలుడు సినిమాలో చైల్డ్​ఆర్టిస్ట్​గా

2003లో ఉషాకిరణ్ మూవీస్​ పతాకంపై వచ్చిన 'తొలిచూపులోనే' చిత్రంతో తెరంగేట్రం చేశారు కల్యాణ్​రామ్. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

తాత నందమూరి తారక రామారావు పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్​ బ్యానర్​ను ప్రారంభించారు కల్యాణ్​రామ్. నిర్మాతగా తొలి చిత్రం అతనొక్కడే.

కల్యాణ్​రామ్ తొలిచూపులోనే సినిమా

ABOUT THE AUTHOR

...view details