మలయాళంలో విజయవంతమైన కథలు తెలుగులోకి రావడం కొత్తేమీ కాదు. తరచూ ఆ చిత్రాలు రీమేక్‌గా తెలుగులో రూపొందుతుంటాయి. ఇప్పటికే చిరంజీవి కోసం 'లూసిఫర్' హక్కుల్ని సొంతం చేసుకున్నాడు రామ్‌చరణ్. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య' కూడా మలయాళ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోంది.
మలయాళ రీమేక్‌లో నందమూరి బాలకృష్ణ!
నటసింహం నందమూరి బాలకృష్ణ త్వరలోనే ఓ మలయాళ రీమేక్‌లో నటించబోతున్నాడని సమాచారం. పృథ్వీరాజ్ నటించిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' మలయాళంలో హిట్‌గా నిలిచింది. ఈ సినిమా హక్కులను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకోగా.. ఈ చిత్రంలో బాలయ్య ప్రధానపాత్రలో నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది.
మళయాళ రీమేక్‌లో నందమూరి బాలకృష్ణ!
తాజాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ 'అయ్యప్పనుమ్ కోశియుమ్' అనే మలయాళ చిత్రం హక్కుల్ని సొంతం చేసుకుంది. అక్కడ అగ్ర కథానాయకుడు పృథ్వీరాజ్ నటించిన చిత్రమిది. తెలుగులోనూ అగ్ర హీరోనే ఈ కథలో నటించే అవకాశాలున్నాయి. తాజాగా బాలకృష్ణ పేరు ప్రచారంలోకి వచ్చింది. మరి నిర్మాతలు అతడ్ని సంప్రదించారా లేదా అనేది తెలియాల్సి ఉంది. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు.
ఇదీ చూడండి.. ఆ ట్వీట్ పెట్టినందుకు అమితాబ్‌పై విమర్శలు