తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అభిమానులకు నందమూరి బాలకృష్ణ సర్​ప్రైజ్ - బాలకృష్ణ న్యూస్

సినీ ప్రేక్షకులతో పాటు అభిమానులకు అగ్రహీరో బాలకృష్ణ సర్​ప్రైజ్ ఇచ్చారు. తన భీష్ముని పాత్రకు సంబంధించిన ఫొటోల్ని భీష్మ ఏకాదశి సందర్భంగా పంచుకున్నారు.

nandamuri balakrishna surprise gift to fans
అభిమానులకు నందమూరి బాలకృష్ణ సర్​ప్రైజ్

By

Published : Feb 23, 2021, 2:58 PM IST

మంగళవారం(ఫిబ్రవరి 23) భీష్మ ఏకాదశి సందర్భంగా నటసింహ నందమూరి బాలకృష్ణ.. 'ఎన్​టిఆర్ కథానాయకుడు' చిత్రంలో తాను భీష్ముని పాత్రలో నటించిన కొన్ని స్టిల్స్​ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

భీష్ముని పాత్రలో బాలకృష్ణ

"భీష్మ పాత్రంటే నాకెంతో ఇష్టం. నాన్న ఆయన వయసుకు మించిన భీష్మ పాత్ర పోషించిన ప్రేక్షకుల విశేష ఆదరాభిమానాలను అందుకున్నారు. ఆ చిత్రం, అందులోని నాన్న నటించిన భీష్ముని పాత్ర నాకెంతో ఇష్టం. అందుకే 'ఎన్​టిఆర్ కథానాయకుడు'లో భీష్ముని సన్నివేశాలు తీశాం. నిడివి ఎక్కువ కావడం వల్ల వాటిని సినిమాలో ఉంచడం కుదరలేదు. ఇవాళ భీష్మ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆ పాత్రకు సంబంధించిన ఫొటోలను ప్రేక్షకులు, అభిమానులతో పంచుకోవాలనుకుంటున్నాను" అని చెప్పారు.​

ఇది చదవండి:ఆ కారు పంపిస్తేనే షూటింగ్‌కు వస్తానన్న బాలకృష్ణ!

ABOUT THE AUTHOR

...view details