చైతన్య రథసారథి, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ రెండో వర్థంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు టీడీపీ శ్రేణులు, పలువురు రాజకీయ నాయకులు నివాళులర్పించారు. ఈ క్రమంలోనే సోదరుడిని గుర్తుచేసుకున్నారు నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఫేస్బుక్లో పోస్ట్ కూడా పెట్టారు.
నందమూరి హరికృష్ణ వర్థంతి సందర్భంగా బాలకృష్ణ నివాళి - CHANDRA BABU HARIKRISHNA
తన సోదరుడు హరికృష్ణ రెండో వర్థంతి సందర్భంగా నివాళి అర్పించారు అగ్రకథానాయకుడు బాలకృష్ణ. నాన్నకు తగ్గ తనయుడు, తెలుగుదేశం తొలి శ్రామికుడు అని గుర్తుచేసుకున్నారు.
నందమూరి హరికృష్ణ-బాలకృష్ణ
"తెలుగుదేశం స్థాపించిన తొలి దినాల్లో నాన్న గారికి చేదోడు వాదోడుగా ఉంటూ చెతన్య రథసారధి అయిన మా అన్న నందమూరి హరికృష్ణ గారు మన మధ్యనుంచి దూరం అయ్యి రెండు సంవత్సరాలు అయ్యింది అంటే నమ్మశక్యం కావటం లేదు. మనస్సు అంగీకరించటం లేదు. నాన్నకు తగ్గ తనయుడు, తెలుగుదేశం పార్టీ తొలి శ్రామికుడు అన్నయ్య హరికృష్ణ గారికి నా నివాళులు అర్పిస్తూ... జోహార్ నందమూరి హరికృష్ణ"
-నందమూరి బాలకృష్ణ, సినీ కథానాయకుడు, ఎమ్మెల్యే