టాలీవుడ్ సీనియర్ నటుడు ఎల్బీ శ్రీరామ్ ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం 'కవిసమ్రాట్'. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను నటసింహం నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
కళాప్రపూర్ణ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ జీవితాధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఎల్బీ శ్రీరామ్ నటిస్తూ.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ క్రియేషన్స్ పతాకంపై స్వీయనిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.