తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Balakrishna talk show: 'పోటీ సినిమాల వరకే.. బయట లెక్కలు వేరు' - Aha balakrishna

అగ్రకథానాయకుడు బాలకృష్ణ(Balakrishna talk show).. తొలిసారి ఓటీటీలో చేస్తున్న టాక్​ షో కర్టెన్​ రైజర్​ను గురువారం లాంఛనంగా ఆవిష్కరించారు. దీపావళి కానుకగా నవంబరు 4 నుంచి ఈ షో ప్రసారం కానుంది.

nandamuri balakrishna new talk show in AHA
బాలయ్య 'అన్​స్టాపబుల్'

By

Published : Oct 14, 2021, 5:03 PM IST

Updated : Oct 14, 2021, 8:50 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా.. ప్రముఖ డిజిటల్​ ప్లాట్​ఫామ్​ 'ఆహా'(OTT Platform Aha) ఓ టాక్​ షో(Balakrishna talk show) నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి 'అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే'(Unstoppable With NBK) అని నామకరణం చేశారు.

ఈ టాక్​ షోలో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు అతిథులుగా పాల్గొననున్నారు. దీపావళి కానుకగా నవంబరు 4న తొలి ఎపిసోడ్​ ప్రసారం కానుంది. ప్రారంభ ఎపిసోడ్​కు మోహన్​బాబు రానున్నారని ప్రచారం సాగుతోంది. ఆ తర్వాత ఎపిసోడ్స్​లో చిరు-రామ్​చరణ్​ కూడా కలిసి రానున్నారని సమాచారం.

.

"సాంఘికం, జానపదం, సోషియో ఫాంటసీ, కుటుంబ కథాచిత్రాల్లో వివిధ పాత్రలు పోషించి మీకు వినోదాన్ని అందించటానికి ప్రయత్నిస్తున్నా. మీరు అంతులేని ప్రేమాభిమానాలతో నన్ను ఆదరిస్తున్నారు. ఇంకా ఎంతో చేయాలని ప్రేరణ ఇస్తోంది మన తెలుగు జాతి. 'ఆహా' ఓటీటీ మాధ్యమం అల్లు అరవింద్‌ మానస పుత్రిక. అంతర్జాతీయ ఓటీటీలకు దీటుగా 'ఆహా'ను స్థాపించారు. అల్లు రామలింగయ్యగారికి మాత్రమే అమ్మానాన్నల దగ్గర చనువు ఉండేది. ఇండస్ట్రీలో ఆ స్థాయి చనువు మరెవరికీ లేదు. దర్శకుడు ప్రశాంత్‌ వర్మతో సహా ఎంతో మంది ఈ షోకు కష్టపడి పనిచేస్తున్నారు. ఒక మనిషి ప్రజెంటేషన్‌ ఆహాలో వస్తున్న 'అన్‌స్టాపబుల్'. నటన అంటే ఒక పాత్రలోకి వెళ్లడం. దాని ఆత్మలోకి ప్రవేశించటం. ఎంతో ఒత్తిడితో కూడుకున్నది. తెలుగువారు గర్వించదగ్గ ఓటీటీ 'ఆహా'. ప్రతి రంగంలోనూ పోటీ ఉంటుంది. అది ఉన్నప్పుడే అసలు మజా ఉంటుంది. మనుషులుగా మనమంతా ఒకటే. బావిలో కప్పలా ఉండకుండా బయటకు వచ్చినప్పుడు అసలు మనిషి బయటకొస్తారు. అలా ఆవిష్కరించే ప్రయత్నమే 'అన్‌స్టాపపబుల్‌'. మనిషి మనిషికీ జీవితంలో ఒక ప్రయాణం ఉంటుంది. రాయికి ఎన్నో దెబ్బలు తగిలితేనే శిల్పం అవుతుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో ఎత్తు పల్లాలుంటాయి. వాటిని అధిగమించి ఒక లక్ష్యాన్ని చేరడమే 'అన్‌స్టాపబుల్‌'. ఇది నాకు నచ్చింది. అందుకే ఈ కార్యక్రమం ఒప్పుకొన్నా. ఈ కార్యక్రమానికి వచ్చే నటీనటులతో కలిసి మాట్లాడతా. వాళ్ల భావోద్వేగాలు పంచుకుంటా. మాటలతో వాళ్లను ట్విస్ట్‌ చేస్తా. కలుద్దాం 'ఆహా'లో 'అన్‌స్టాపబుల్‌" అని బాలకృష్ణ చెప్పారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 14, 2021, 8:50 PM IST

ABOUT THE AUTHOR

...view details