తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఓటీటీలో బాలయ్య కొత్త ప్రయోగం.. ఆధ్యాత్మిక కార్యక్రమంతో! - balayya boyapati cinema

స్మాల్​ స్క్రీన్​పై మరింత సందడి చేసేందుకు బాలయ్య సిద్ధమవుతున్నారు. ఓటీటీలో హోస్ట్​గా చేస్తున్న ఆయన త్వరలో ఓ భక్తి ఛానెల్​ను ప్రారంభిద్దామని అనుకుంటున్నట్లు చెప్పారు. 'అఖండ' ప్రీ రిలీజ్ వేడుకలో ఈ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

balakrishna akhanda
బాలకృష్ణ

By

Published : Nov 28, 2021, 1:53 PM IST

నందమూరి బాలకృష్ణ 'అఖండ' ప్రీ రిలీజ్​ ఈవెంట్​.. హైదరాబాద్​లో శనివారం రాత్రి భారీస్థాయిలో జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు రాజమౌళి.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్​లో బాలయ్య మాట్లాడుతూ పలు షాకింగ్ కామెంట్స్ చేశారు. త్వరలో ఓ భక్తి ఛానెల్​ ప్రారంభిద్దామని అనుకుంటున్నట్లు చెప్పారు.

అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్​లో బాలయ్య స్పీచ్

"ఇది కార్తీకమాసం కాబట్టి అందరికీ శివపార్వతుల ఆశీస్సుల ఉండాలి. మనందరం అనుకునే ప్రతి మాట వెనుక ఓ పవర్​ ఉంటుంది. నవరసల్లానే మన పూజా విధానాలు కూడా తొమ్మిది రకాలని చెబుతుంటారు మన భక్తి టీవీల్లో. ఇక 'ఆహా' ఓటీటీలో యాంకరింగ్ చేస్తున్నట్లే.. త్వరలో ఓ భక్తి ఛానెల్​ కూడా స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను" అని బాలయ్య అన్నారు.

కరోనా సమయంలో పలువురు ప్రాణాలకు తెగించి షూటింగ్​లు చేశారని, వాళ్లు ఏం చేసినా సినిమా కోసమేనని బాలయ్య చెప్పారు. కష్టకాలంలో ఉన్న సినీ ఇండస్ట్రీని ఆదుకోవాలని ప్రభుత్వాలను కోరారు. రానున్న కాలంలో పుష్ప, ఆర్ఆర్ఆర్, ఆచార్య విడుదలవుతున్నాయని.. ఈ సినిమాలు మంచిగా ఆడేలా ప్రభుత్వాలు సహకరించాలని కోరుతున్నట్లు బాలయ్య వ్యాఖ్యానించారు.

బాలయ్య అల్లు అర్జున్

'అఖండ' సినిమా డిసెంబరు 2న థియేటర్లలోకి రానుంది. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అఘోరా పాత్రలోనూ కనువిందు చేయనున్నారు. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్​ విలన్​గా చేశారు. జగపతిబాబు, పూర్ణ కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించగా, బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. రవీందర్ రెడ్డి నిర్మించారు.

అఖండ సినిమాలో బాలయ్య

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details