తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలకృష్ణ.. ఎనర్జీకే పవర్​హౌస్​: ప్రగ్యా - ప్రగ్యాజైశ్వాల్​ వార్తలు

టాలీవుడ్​ అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణపై హీరోయిన్​ ప్రగ్యా జైశ్వాల్​ ప్రశంసలు కురిపించారు. బాలయ్య ఎనర్జీకి పవర్​హౌస్​ లాంటి వారని ఆమె అన్నారు. సినిమా పట్ల బాలకృష్ణకు ఉన్న అభిరుచికి ఎవరూ సాటిరారని ప్రగ్యా తెలిపారు.

Nandamuri Balakrishna is a powerhouse of energy says pragya jaiswal
బాలకృష్ణ ఎనర్జీకే పవర్​హౌస్​: ప్రగ్యా

By

Published : Mar 17, 2021, 2:28 PM IST

అగ్ర కథానాయకుడు బాలకృష్ణతో కలిసి స్క్రీన్‌ పంచుకోవడం అద్భుతంగా ఉందని నటి ప్రగ్యాజైశ్వాల్‌ అన్నారు. 'కంచె' చిత్రంతో తెలుగులో మొదటి అవకాశంతోనే గుర్తింపు తెచ్చుకున్న ప్రగ్యా.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. ఈ క్రమంలోనే ఆమెకు బాలయ్యతో కలిసి నటించే అవకాశం లభించింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో ఆమె కీలకపాత్రలో కనిపించనున్నారు. 'బీబీ3'లో నటించడంపై ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ప్రగ్యా మాట్లాడారు.

ప్రగ్యా జైశ్వాల్​

"బాలకృష్ణ సర్‌తో స్క్రీన్‌ పంచుకోవడం అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఆయన ఎనర్జీకే పవర్‌హౌస్‌. సెట్‌లో ఎప్పుడూ పాజిటివిటీని నెలకొల్పుతారు. సినిమా పట్ల ఆయనకున్న అభిరుచికి ఎవరూ సాటిరారు. 'బీబీ3' కంటే ముందే 'జయ జానకి నాయక' కోసం బోయపాటి డైరెక్షన్‌లో నటించాను. ఇప్పుడు బోయపాటితో కలిసి వర్క్‌ చేయడం సులభంగా అనిపిస్తోంది. కథ పట్ల దర్శకుడికి ఉన్న విజన్‌, స్పష్టత ఎంతో స్ఫూర్తిదాయకమైనది. నటీనటులు, ఇతర చిత్రబృందం మరింత శ్రమించే విధంగా ప్రతిరోజూ ఆయన మమ్మల్ని ప్రేరేపిస్తున్నారు.’’

- ప్రగ్యా జైశ్వాల్​​, కథానాయిక

కరోనా సంక్షోభం తర్వాత తాను నటిస్తున్న మొదటి చిత్రమిదని ప్రగ్యా జైశ్వాల్ వెల్లడించారు​. ఈ చిత్రం తనకెంతో ప్రత్యేకమని.. అలాగే నటిగా తన కలల్ని సాకారం చేసుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. మరోవైపు 'సింహా', 'లెజండ్‌' తర్వాత బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది.

ఇదీ చూడండి:సాయిపల్లవికి ఇంట్లో నుంచే పోటీ మొదలైందా?

ABOUT THE AUTHOR

...view details