తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కేజీఎఫ్ 2' సినిమాలో బాలకృష్ణ ఉన్నారా? - బాలకృష్ణ తాజా వార్తలు

'కేజీఎఫ్ 2' బాలయ్య ఉన్నారనే వార్త అభిమానుల్ని ఒక్కసారిగా ఆశ్చర్యపడేలా చేసింది. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకలా అనుకున్నారు?

nandamuri balakrishna in KGF2 cinema
'కేజీఎఫ్ 2' సినిమాలో హీరో బాలకృష్ణ!

By

Published : Dec 26, 2020, 3:33 PM IST

'కేజీఎఫ్ 2' సినిమాలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారా? అదేంటి హీరో యష్​ కదా బాలయ్య ఇందులో ఉన్నారా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. విషయం ఏంటని తెగ మాట్లాడేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

సెర్చ్​లో బాలయ్య పేరు చూపిస్తున్న గూగుల్​

ఇంతకీ ఏంజరిగింది?

'కేజీఎఫ్ 2' సినిమా క్యాస్ట్​ అని గూగుల్​లో సెర్చ్​ చేస్తే యష్, సంజయ్ దత్, ప్రకాశ్ రాజ్​ తదితరుల పేర్లతో పాటు బాలయ్య పేరు కూడా ఉంది. ఇనాయత్ ఖలీ పాత్రలో ఆయన నటిస్తున్నారని గూగుల్ చూపిస్తోంది. దీనిని చూసిన పలువురు నెటిజన్లు.. సోషల్ మీడియాలో పంచుకోవడం వల్ల అది వైరల్​ అయింది.

భారీ బడ్జెట్​తో పాన్ ఇండియా కథతో 'కేజీఎఫ్ 2' చిత్రాన్ని తీస్తున్నారు. జనవరి 8న యష్ పుట్టినరోజు కానుకగా టీజర్​ను విడుదల చేయనున్నారు. వేసవికి థియేటర్లలో సినిమాను రిలీజ్ చేసే అవకాశముంది.

కేజీఎఫ్ 2 కొత్త పోస్టర్

ABOUT THE AUTHOR

...view details