జానపదం.. పౌరాణికం.. యాక్షన్.. లవ్.. సోషియో ఫాంటసీ ఇలా జోనర్ ఏదైనా సరే ఆ కథలో, పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారు నటసింహం నందమూరి బాలకృష్ణ. మాస్ ప్రేక్షకుల నాడి తెలిసిన 'సుల్తాన్' ఆయన. 'అన్నదమ్ముల అనుబంధం'తో ఇండస్ట్రీలో మెరిసి 'మంగమ్మగారి మనవడు'గా పేరు తెచ్చుకుని 'టాప్ హీరో'గా ఎదిగారు. అయినవాళ్లకు 'మిత్రుడు'గా కోపం వస్తే 'డిక్టేటర్'గా ఉంటూ 'లెజెండ్' అనిపించుకున్న బాలయ్య ప్రతి పదో చిత్రంలో విభిన్నతను చాటారు. అలా ఆయన నటించిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద 'పైసా వసూల్' చేశాయి. సినీ పరిశ్రమలోకి బాలకృష్ణ అడుగుపెట్టి నేటికి 46 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో జయాపజయాలతో సంబంధం లేకుండా యువ కథానాయకులకు దీటుగా సినిమాలు చేసుకుంటూ సాగిపోతున్నారు బాలయ్య. అలాంటి ఆయన కెరీర్‌లో మైలురాయిలాంటి పలు చిత్రాలు ఉన్నాయి. ఇందులో కొన్ని బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని చాటితే, మరికొన్ని అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాయి. మరి ఆ సినిమాలేంటో ఓసారి చూద్దామా!
తాతమ్మకల
నందమూరి తారక రామారావు నట వారసుడిగా బాలకృష్ణ వెండితెరకు పరిచయమైన చిత్రం 'తాతమ్మ కల'. ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1974లో ఇది విడుదలైంది. కరవుతో విలవిల్లాడుతున్న ఓ మారుమూల గ్రామంలో ఒంటరిగా జీవితాన్ని వెళ్లదీస్తున్న తన మామ్మ కలను సాకారం చేసి.. ఆ ఊరిని మార్చే తెలివైన అబ్బాయిగా బాలకృష్ణ మెప్పించారు. నిజ జీవితంలో అన్నదమ్ములైన హరికృష్ణ-బాలకృష్ణ.. రీల్‌లైఫ్‌లోనూ సోదరులుగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
అనురాగ దేవత
ఎన్టీఆర్, జయసుధ, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'అనురాగ దేవత'. బాలీవుడ్‌లో తెరకెక్కిన 'ఆషా' సినిమాని ఆధారంగా చేసుకుని దీనిని రూపొందించారు. 1982లో విడుదలైన ఈ సినిమాలో బాలకృష్ణ కీలకపాత్రలో నటించారు. ఇది ఆయన పదో చిత్రం. ఇందులో ఎన్టీఆర్-బాలయ్య మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.
బాబాయ్ అబ్బాయ్
'సాహసమే జీవితం' అనే చిత్రంతో బాలయ్య సోలో హీరోగా మారారు. అలా బాలయ్య హీరోగా నటించిన మొదటి చిత్రం 1984లో విడుదలైంది. అదే ఏడాదిలో ఆయన కథానాయకుడిగా నటించిన ఏడు చిత్రాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత బాలయ్య 20వ చిత్రం 'బాబాయ్ అబ్బాయ్'. జంధ్యాల దర్శకత్వం వహించారు. ఇందులో బాలకృష్ణ, సుత్తి వీరభద్రరావుల నటన ఆద్యంతం నవ్వులు పూయించింది.
నిప్పులాంటి మనిషి
బాలీవుడ్‌లో తెరకెక్కిన 'ఖయామత్' చిత్రానికి రీమేక్‌గా 'నిప్పులాంటి మనిషి' రూపొందింది. ఎస్.బి.చక్రవర్తి దర్శకత్వం వహించిన యాక్షన్ ఫిల్మ్‌లో బాలయ్య సరసన రాధ హీరోయిన్గా నటించారు. శరత్‌బాబు కీలకీపాత్రలో మెప్పించారు. 1986లో విడుదలైన ఈ చిత్రం బాలకృష్ణ నటించిన 25వ సినిమా.
కలియుగ కృష్ణుడు
పరచూరి బ్రదర్స్ రచనలో మురళీ మోహన్‌రావు డైరెక్ట్ చేసిన సినిమా 'కలియుగ కృష్ణుడు'. బాలకృష్ణ-రాధ నటీనటులుగా రావుగోపాలరావు, శారదా, అల్లు రామలింగయ్య కీలకపాత్రలు పోషించారు. ఇందులో బాలయ్య చెప్పిన డైలాగులు సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇది బాలకృష్ణ నటించిన 30వ సినిమా.
దొంగరాముడు
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన యాక్షన్ కథాచిత్రం 'దొంగ రాముడు'. 1988లో తెరకెక్కిన ఈ చిత్రం బాలయ్య కెరీర్‌లో ఓ మైలురాయిగా చెప్పుకోవచ్చు. బాలకృష్ణ నటన, రాధ అభినయం ప్రేక్షకులను అలరించాయి. ప్రతినాయకుడిగా మోహన్‌బాబు యాక్షన్, చక్రవర్తి సంగీతం సినిమాని మరోస్థాయికి తీసుకువెళ్లాయి. ఇది బాలయ్య నటించిన 40వ సినిమా.
నారీ నారీ నడుమ మురారి