బోయపాటి శ్రీను తీసిన 'సింహా', 'లెజెండ్' రెండింటిలోనూ బాలకృష్ణ డ్యుయల్ రోల్‌లోనే కనిపించాడు. ఇప్పడు వీళ్లిద్దరి కలయికలో రాబోతున్న మూడో చిత్రంలోనూ ఈ నందమూరి నట సింహం ద్విపాత్రాభినయం చేయనున్నాడట. అంతేకాదు.. ఈ సినిమాతో బోయపాటి సినీప్రియులకు డబుల్ ధమాకాతో ట్రిపుల ట్రీట్ అందించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అఘోరా బాబా పాత్రలో..
బాలకృష్ణ ఈ సినిమాలో రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించినా మూడు విభిన్నమైన లుక్స్‌తో సర్‌ప్రైజ్ చెయ్యబోతున్నాడట. వీటిలో 15 నిమిషాల నిడివితో ఉండే బాలయ్య అఘోరా బాబా పాత్ర చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సమాచారం. దీని కోసం వారణాసి అడవుల్లో అఘోరాలు నివసించే ప్రాంతాల్లో చిత్రీకరణ జరపనున్నారట. ఇప్పటికే ఈ హీరో బోయపాటి బృందం ఆయా ప్రాంతాల్లో పర్యటించి మరీ సినిమాకు అవసరమైన లొకేషన్లను ఫైనల్ చేసినట్లు వార్తలొస్తున్నాయి.