నటసింహం నందమూరి బాలకృష్ణ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు, ప్రముఖులు.. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. అలానే అమెరికాలో ఈయన పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా జరిపారు. 60 నగరాల్లో 60 కేకులు కోసి సందడి చేశారు.
అమెరికాలోని 60 నగరాల్లో బాలయ్య పుట్టినరోజు వేడుకలు - నందమూరి బాలకృష్ణ తాజా వార్తలు
హీరో బాలకృష్ణ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, అమెరికాలోని 60 నగరాల్లో 60 కేకులు కోసి పుట్టినరోజు వేడుకల్ని జరుపుకున్నారు పలువురు అభిమానులు.
నందమూరి బాలకృష్ణ
"ఇక్కడ బే ఏరియాతో బాలయ్యకు ఎంతో అనుబంధం ఉంది. గతంలో రెండుసార్లు ఆయన తన పుట్టినరోజును మనందరితో (ఎన్నారైలతో) ప్రత్యక్షంగా ఘనంగా జరుపుకున్నారు. ఈసారి అమెరికా ప్రభుత్వ కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిస్తూ ఘనంగా జరుపుకున్నాం" -కోమటి జయరాం, తెలుగుదేశం ఎన్నారై విభాగం నాయకుడు
ఇదీ చూడండి: